సారాంశం
Read the full fact sheet- బాధ కలిగించే లేదా భయానకమైన సంఘటన తర్వాత మీకు బలమైన ప్రతిస్పందన ఉండటం సాధారణం. బాధాకరమైన సంఘటన: కార్చిచ్చు లేదా వరదలు మీ పై జరిగిన నేరం లేదా హింసాత్మక చర్య ఒక కారు ప్రమాదం శారీరకంగా లేదా లైంగికంగా దాడి చేయబడటం బాధాకరమైన సంఘటనల గురించి చిత్రాలు, వార్తా నివేదికలు లేదా సామాజిక మాధ్యమాలలో చూడటం.
- మీరు శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ప్రవర్తనా ప్రతిచర్యలను అనుభవించవచ్చు. కానీ మీరు తట్టుకుని కోలుకోవడానికి చేయగలిగేవి చాలా ఉన్నాయి.
- 3-4 వారాల తర్వాత కూడా మీకు లక్షణాలు కనిపిస్తే, సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
On this page
ఎక్కడ సహాయం పొందాలి
- సాధారణ వైద్యుడు (వైద్యుడు)
- మీ మానసిక ఆరోగ్య నిపుణుడు, ఉదాహరణకు మనోరోగ వైద్యుడు, మనస్తత్వవేత్త, సలహాదారుడు లేదా సామాజిక కార్యకర్త
- మీ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం
- ఆస్ట్రేలియన్ సైకలాజికల్ సొసైటీ రెఫరల్ సర్వీస్టె టెలిఫోన్. 1800 333 497
- ఫీనిక్స్ ఆస్ట్రేలియా సెంటర్ ఫర్ పోస్ట్-ట్రామాటిక్ మెంటల్ హెల్త్ టెలిఫోన్. (03) 9035 5599
- సెంటర్ ఫర్ గ్రీఫ్ అండ్ బిరీవ్ మెంట్ టెలిఫోన్. 1800 642 066
ఉచిత నిపుణుని వ్యాకులత సహాయం:
- మీరు ఏదైనా నేరానికి గురై ఉంటే, victimsofcrime.vic.gov.au/services-for-victims-of-crime-[telugu] ని సందర్శించండి. మీరు విక్టిమ్స్ అఫ్ క్రైం హెల్ప్ లైన్ 1800 819 817 కూడా సంప్రదించవచ్చు. భాష్యకారులు అందుబాటులో ఉన్నారు.
- మీరు కారు ప్రమాదానికి గురై ఉంటే, (03) 8877 6900 లేదా 1300 367 797 సంఖ్యల్లో ఏంబర్ కమ్యూనిటీ - రోడ్ సపోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ ను సంప్రదించండి.
మీరు వీరి నుండి సలహా పొందవచ్చు:
- లైఫ్లైన్ టెలిఫోన్. 13 11 14
- గ్రీఫ్ లైన్ టెలిఫోన్. 1300 845 745
- బియాండ్ బ్లూ టెలిఫోన్. 1300 22 4636
- నర్స్-ఆన్-కాల్ టెలిఫోన్. 1300 60 60 24 - నిపుణుల ఆరోగ్య సమాచారం మరియు సలహా కోసం (24 గంటలు, 7 రోజులు)
- ఆస్ట్రేలియన్ పేరెంటింగ్ వెబ్సైటు - raisingchildren.net.au
ఈ వ్యాకులత మరియు కోలుకునే పాడ్కాస్ట్ వినవచ్చు.
వ్యాకులతకి మీరు ఎలా స్పందించవచ్చు
వ్యాకులతకి మీరు స్పందించే విధానం దీనిపై ఆధారపడి ఉంటుంది:
- బాధాకరమైన సంఘటన రకం మరియు తీవ్రత
- మీకు ఏదైనా మునుపటి అనుభవం లేదా శిక్షణ బట్టి
- మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లయితే లేదా ప్రేక్షకుడి (చూపరి)గా ఉంటే
- సంఘటన తర్వాత మీకు లభించే మొత్తం సహాయం
- మీ జీవితంలో జరుగుతున్న ఇతర ఒత్తిడితో కూడిన విషయాలు
- ఒత్తిడితో కూడిన సంఘటనలను మీరు సాధారణంగా ఎలా ఎదుర్కొంటారు
- ఏదైనా మునుపటి బాధాకరమైన అనుభవాలు.
ఒక బాధాకరమైన సంఘటన ముగిసినప్పుడు, మీరు ఆ సంఘటనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇందులో వీటి గురించి ఆలోచించడం కూడా ఉండవచ్చు:
- అది ఎలా మరియు ఎందుకు జరిగింది
- మీరు ఎలా మరియు ఎందుకు పాల్గొన్నారు
- మీకు అలా ఎందుకు అనిపిస్తుంది
- మీరు కలిగి ఉన్న భావాలు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయా
- ఆ అనుభవం జీవితంపై మీ దృక్పథాన్ని ఎలా మార్చింది.
మీరు భావోద్వేగ, మానసిక, శారీరక మరియు ప్రవర్తనా ప్రతిచర్యలను కూడా అనుభవించవచ్చు.
వ్యాకులతకు భావోద్వేగ ప్రతిచర్యలు
మీకు అనిపించవచ్చు:
- చాలా ఒత్తిడి, ఆందోళన లేదా భయం
- ఇంకేదో జరగబోతోందన్న భయంతో
- మీరు ప్రమాదంలో ఉన్నట్లు
- స్తబ్దత లేదా కలత చెందు
- తికమక పడు
- తరచుగా భావోద్వేగానికి గురి కావడం మరియు కలత చెందడం
- చాలా అలసిపోవుట
- క్రుంగిపోవుట
- కుటుంబం మరియు స్నేహితులతో సహా ఇతరుల రక్షణ
- మీరు మీ ఇంటిని వదిలి వెళ్లకూడదనుకుంటున్నట్లుగా
- మీరు వ్యక్తులు మరియు ప్రదేశాల నుండి వైదొలగాలని లేదా దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు.
ఈ ప్రతిచర్యలు సాధారణం, మరియు మీరు ఒకేసారి అనేక ప్రతిచర్యలను అనుభవించవచ్చు.
ఇది మీ శరీరం యొక్క సహజ వైద్యం మరియు కోలుకునే ప్రక్రియలో భాగం, మరియు చాలా సందర్భాలలో మీరు మంచి అనుభూతి చెందుతారు.
వ్యాకులతకు మానసిక ప్రతిచర్యలు
మీరు:
- మీ ఏకాగ్రతతో లేదా విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడవచ్చు
- మీరు కోరుకోనప్పుడు ఆ సంఘటన గురించి ఆలోచించడం
- ఆ సంఘటనను మీ మనసులో మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవడం
- గందరగోళంగా లేదా దిక్కుతోచని స్థితిలో ఉండడం.
వ్యాకులతకు శారీరక ప్రతిచర్యలు
మీ శరీరం:
- అలసిపోయి లేదా దుర్బల పడడం
- నిద్రపోవదానికి కష్టపడడం
- వికారం, వాంతులు, తలతిరుగుడు మరియు తలనొప్పి లాంటివి రావడం
- అధిక చెమట పట్టడం
- అధిక హృదయ స్పందన రేటు కలిగి ఉండడం.
వ్యాకులతకు ప్రవర్తనా ప్రతిచర్యలు
మీరు వీటిని చేయాలనుకోవచ్చు:
- ఆ సంఘటన గుర్తు చేసుకోకుండా ఉండండి
- ఏమి జరిగిందో ఆలోచిస్తూ, మాట్లాడుతూ ఉండండి
- మీరు సాధారణంగా రోజువారీ చేసే పనులను మార్చడం లేదా ఉపసంహరించుకోవడం
- చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ తినడం
- ఎక్కువ మద్యం మరియు/లేదా కాఫీ తాగడం
- పొగ సిగరెట్ల పొగ త్రాగడం
- నిద్రలేమి.
వ్యాకులత తరువాత ఎలా నయం కావాలి మరియు కోలుకోవాలి
మీ భద్రతను లేదా జీవితాన్ని లేదా ఇతరుల జీవితాన్ని ప్రమాదంలో పడేసే ఏదైనా మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని 'అత్యవసర సరణి' అని పిలుస్తారు మరియు మీ శరీరం ముప్పుకు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. మన మనుగడకు సహాయపడటానికి మన శరీరాలు తక్కువ సమయంలోనే మనకు చాలా శక్తిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి.
చాలా మంది వ్యక్తులు స్వల్ప కాలం పాటు 'అత్యవసర సరణి'లోనే ఉంటారు. కానీ ఊహించని విషయాలు జరిగినప్పుడు లేదా మీరు మళ్ళీ ఒత్తిడికి గురైనప్పుడు మీరు 'అత్యవసర సరణి'కి తిరిగి రావచ్చు. అందుకే బాధాకరమైన సంఘటన తర్వాత మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు.
మీ శరీరం కోలుకోవడానికి మరియు స్వస్థత పొందడానికి, మీరు 'అత్యవసర సరణి' నుండి బయటపడటానికి మీకు మీరే సహాయం చేసుకోవాలి. ఇది మీ శరీరం తిరిగి శక్తి స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇది సాధారణంగా సంఘటన జరిగిన ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలంలో జరుగుతుంది.
మీరు నయమవడానికి మరియు కోలుకోవడానికి సహాయపడే అనేక వ్యూహాలు ఉన్నాయి. మీరు:
- బాధాకరమైన లేదా భయానక అనుభవాన్ని పొందారని గుర్తించండి. మీ ప్రతిచర్యలు సాధారణమైనవి
- మీలాగా ఉండరని అంగీకరించండి, కానీ ఇది అధిగామించగలరు
- మామూలుగా పనులు చేయలేకపోతే మీ మీద కోపం లేదా నిరాశ చెందకుండా ఉండటానికి ప్రయత్నించండి
- ఎదుర్కోవటానికి (భరించడానికి) మద్యం లేదా మాదకద్రవ్యాలను వాడకుండా ఉండండి
- బాగుపడే వరకు ప్రధాన నిర్ణయాలు లేదా జీవితంలో పెద్ద మార్పులు తీసుకోకుండా ఉండండి
- మీ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి కావలసినంత సమయం తీసుకోండి
- మిమ్మల్ని అర్థం చేసుకుని, మీకు మద్దతు ఇవ్వగల వారితో మాట్లాడండి
- మీ సాధారణ దినచర్యను కొనసాగించడానికి మరియు తీరిక లేకుండా ఉండటానికి ప్రయత్నించండి.
- కొన్ని ప్రదేశాలు లేదా కార్యకలాపాలను నివారించడానికి మీ దారి మల్లకుండా ఉండడానికి ప్రయత్నించండి
- విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి సమయం కేటాయించండి
- మీకు ఏ సహాయం కావాలో మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు చెప్పండి, ఉదాహరణకు సమయం కేటాయించడం లేదా ఎవరితోనైనా మాట్లాడటం వంటివి
- యోగా, శ్వాస లేదా ధ్యానం వంటి విశ్రాంతి పద్ధతులను ఉపయోగించండి. మీరు సంగీతం వినడం లేదా తోటపని వంటి మీకు నచ్చే పనులు కూడా చేయవచ్చు
- మీ భావాలను మీరు అనుభూతి చెందుతున్నట్లుగా వ్యక్తపరచండి. మీరు మీ భావాల గురించి ఎవరితోనైనా మాట్లాడవచ్చు లేదా వాటిని వ్రాయవచ్చు
- మీ జ్ఞాపకాలను మరియు అనుభవాలను మీరు అనుభవించినప్పుడు ప్రతిఘటించండి. వాటి గురించి ఆలోచించండి, తర్వాత వాటిని పక్కన పెట్టండి. అది ఇతర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తే, వాటిని ప్రస్తుత సమస్య నుండి వేరుగా ఉంచడానికి ప్రయత్నించండి.
మీరు ఇంకా ఇబ్బంది పడుతుంటే, మీరు నిపుణుల సహాయం పొందవచ్చు
బాధాకరమైన సంఘటన వల్ల కలిగే ఒత్తిడి నిరంతరంగా మారవచ్చు. మీరు ఈ క్రింది సందర్భాలలో వృత్తిపరమైన సహాయం తీసుకోవాలి:
- సంఘటన జరిగిన ఒక నెల కంటే ఎక్కువ కాలం తర్వాత మానసికంగా చాలా బాధగా అనిపిస్తుంటే
- స్తబ్దత మరియు ఖాళీతనం అనుభవిస్తుంటే
- ఒత్తిడి యొక్క శారీరక సంకేతాలను కొనసాగితే
- నిద్ర భంగం లేదా పీడకలలు రావడం కొనసాగితే
- మీ అనుభవాలను గుర్తుచేసే దేనినైనా నివారించడానికి ప్రయత్నించండి
- మీ భావాలను పంచుకోవడానికి ఎవరూ లేకపోతే
- కుటుంబం మరియు స్నేహితులతో సంబంధాలు దెబ్బతింటున్నాయని అనుకుంటే
- పరధ్యానంలో ఉన్నట్లనిపిస్తే
- ఎక్కువ మద్యం లేదా మాదకద్రవ్యాలు ఉపయోగిస్తుంటే
- పనికి తిరిగి రాలేక లేదా రోజువారీ బాధ్యతలను నిర్వహించలేకపోతే
- బాధాకరమైన అనుభవం పునరావృతం అవుతుంటే
- ఎప్పుడూ భయపడుతూ ఉంటూ మరియు సులభంగా సంభ్రమాశ్చర్యాలకు గురౌతుంటే.
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) గురించి
ఒక బాధాకరమైన సంఘటన తర్వాత, కొంతమందికి దాదాపు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత కూడా వారు కోలుకోవడం లేదని అనిపిస్తుంది.
ఈ రకమైన ప్రతిచర్య మీ జీవితాన్ని చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది కుటుంబం మరియు స్నేహితులతో మీ సంబంధాలను మార్చవచ్చు లేదా మీరు పని చేయడం కష్టతరం చేయవచ్చు.
ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లేదా PTSD కావచ్చు.
మీరు PTSD తో బాధపడుతున్నారని అనుకుంటే, ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి.
మీరు ఎప్పుడైనా మీ మానసిక ఆరోగ్యం గురించి లేదా సన్నిహిత వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే, 13 11 14 నంబర్లో లైఫ్లైన్కు సంప్రదించండి.