సారాంశం
Read the full fact sheet- మీ బిడ్డ బాధాకరమైన లేదా భయానక అనుభవాల నుండి కోలుకోవడానికి మీరు సహాయం చేయవచ్చు. ఈ అనుభవాలలో ఇవి ఉండవచ్చు: కారు ప్రమాదాలు కార్చిచ్చులు మరియు వరదలు కుటుంబంలో ఆకస్మిక అనారోగ్యం లేదా మరణం నేరం, దుర్వినియోగం లేదా హింస
- పిల్లలు వీటి కోసం చూస్తారు: సంక్షోభాన్ని మీకు మీరే ఎలా ఎదుర్కొంటారు వారి భావాలు మరియు ప్రవర్తనకు మీరు ఎలా స్పందిస్తారు
- ఈ చిట్కాలు మీ పిల్లల అనుభవాల గురించి వారితో సంభాషించడానికి మీకు సహాయపడతాయి. మీ పిల్లల వయస్సుకి అర్థమయ్యే విధంగా వారికి వాస్తవాలను చెప్పడం ముఖ్యం.
- మీరు ఎల్లప్పుడూ వృత్తిపరమైన సహాయం పొందవచ్చు. మీ కుటుంబ వైద్యునితో ప్రారంభిస్తే మంచిది.
On this page
పిల్లలు వ్యాకులతకు ఎలా స్పందిస్తారు
బాధ కలిగించే లేదా భయానక అనుభవానికి పిల్లల ప్రతిస్పందన దీనిపై ఆధారపడి ఉంటుంది:
- వారి వయసు
- వారి వ్యక్తిత్వం
- మీరు లేదా మీ కుటుంబం ఎలా స్పందిస్తున్నారు
మీ బిడ్డ మీరు ఆశించిన విధంగా స్పందించకపోవచ్చు. ఇవి కావచ్చు:
- విరమించుకోవడం - వారు కార్యకలాపాలపై ఆసక్తిని కోల్పోవచ్చు. వారు తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉండవచ్చు, నిశ్శబ్దంగా ఉండవచ్చు లేదా వారు శిశువుగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో అలానే తిరిగి ప్రారంభించవచ్చు.
- వారు కార్యనిమగ్నులై ఉన్నారు – ఆ అనుభవాన్ని మళ్ళీ అనుభవించాల్సి రావచ్చు. ఉదాహరణకు, పునరావృత ఆట లేదా చిత్రలేఖనం ద్వారా. మీ బిడ్డ భవిష్యత్తు సంఘటనల గురించి భయపడవచ్చు లేదా పీడకలలు రావచ్చు.
- ఆందోళన - వారికి ఏకాగ్రత వహించడంలో లేదా శ్రద్ధ వహించడంలో సమస్యలు ఉండవచ్చు. వారు మీకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలని కోరుకోవచ్చు, నిద్ర సమస్యలు ఉండవచ్చు లేదా సులభంగా నిరాశ చెందవచ్చు.
- అనారోగ్యం - వారికి తలనొప్పి మరియు కడుపునొప్పి ఉండవచ్చు.
మీ బిడ్డకు ఆలస్యంగా ప్రతిచర్య ఉండవచ్చు. కొంతమంది పిల్లలు బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ రోజులు, వారాలు లేదా నెలల తర్వాత కూడా స్పందించవచ్చు.
వ్యాకులమైన సంఘటన గురించి ఎలా మాట్లాడాలి
మీరు మీ పిల్లలతో నిజాయితీగా ఉంటే వారికి సహాయపడుతుంది. మీరు:
- మీ బిడ్డ సురక్షితంగా ఉన్నారని మరియు కార్యక్రమం ముగిసిందని వారికి భరోసా ఇవ్వండి. మీరు వారికి చాలాసార్లు భరోసా ఇవ్వవలసి రావచ్చు.
- మీ బిడ్డ మాట వినండి. వారి ఆందోళనలను మరియు భావాలను తీవ్రంగా పరిగణించండి.
- మీ బిడ్డ ఏమి అనుకుంటున్నారో మీరు వినాలనుకుంటున్నారని వారికి తెలియజేయండి.
- మీ పిల్లల వయస్సుకి తగిన విధంగా ఏమి జరిగిందో చెప్పండి. వారికి అర్థమయ్యే భాషను ఉపయోగించండి. మీ బిడ్డకు ప్రాథమిక వాస్తవాలు తెలియకపోతే, ఏమి జరిగిందో వారు స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కథను పూర్తి చేయడానికి వారు తమ ఊహను లేదా పరిమిత సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఇది మీ బిడ్డకు మరింత ఆందోళన మరియు గందరగోళాన్ని సృష్టించవచ్చు.
- మీ బిడ్డకు అది వారి తప్పు కాదని తెలుసని నిర్ధారించుకోండి. వారు కొంటెగా ఉన్నా లేదా ఎవరి గురించైనా చెడుగా ఆలోచిస్తే వారు ఇలా అనుకోవచ్చు.
- ఆ కార్యక్రమం గురించి కుటుంబమంతా కలిసి మాట్లాడండి. పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెప్పనివ్వండి. ఇది ప్రతి ఒక్కరికీ మద్దతు, విన్న మరియు అర్థం చేసుకునే అనుభూతిని కలిగిస్తుంది.
- వ్యాకులతకు ప్రజలు ఎలా స్పందిస్తారో మీ పిల్లలతో మాట్లాడండి. ఈ పరిస్థితుల్లో వారి భావాలు సాధారణమైనవని చెప్పండి. కాలక్రమేణా వారు మెరుగ్గా భావిస్తారని మీరు వారికి భరోసా ఇవ్వవచ్చు.
వ్యాకులమైన సంఘటనకు మీరు ఎలా స్పందించగలరు
మీ పిల్లల భావాలు మరియు ప్రవర్తనకు మీరు చూపే ప్రతిచర్యలు వారి కోలుకోవడంపై ప్రభావం చూపుతాయి. ఇది ముఖ్యం:
- వారి ప్రవర్తనలో వచ్చే మార్పుల గురించి అర్థం చేసుకోండి. పిల్లలు బాధ కలిగించే లేదా భయానక సంఘటనలకు భిన్నంగా స్పందిస్తారు. వారి ప్రవర్తనలో ప్రకోపనాలు లేదా పక్క తడపడం వంటి మార్పులు సాధారణం.
- మీ బిడ్డపై అదనపు శ్రద్ధ చూపండి. ఇది నిద్రవేళలో మరియు విడిపోయే ఇతర సమయాల్లో ముఖ్యమైనది కావచ్చు.
- మీ కోసం సహాయం పొందండి. పిల్లలు సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ప్రతిస్పందించడానికి వారి తల్లిదండ్రులను లేదా సంరక్షకులను అనుకరిస్తారు. వారి భయాలను అర్థం చేసుకోవడానికి మరియు వారిని ఓదార్చడానికి వారి చుట్టూ పెద్దలు అవసరం. మీరు బాధలో ఉంటే, మీకు కూడా మద్దతు లభిస్తుంది. మీరు అలా చేయకపోతే, అది మీ బిడ్డలో భయం మరియు ఒత్తిడిని పెంచుతుంది.
- మీ బిడ్డతో మీ భావాల గురించి సముచితమైన రీతిలో మాట్లాడండి. ఇది వారి గురించి మాట్లాడటానికి వారికి సహాయపడుతుంది.
- ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారని మరియు ప్రతి ఒక్కరూ విభిన్న భావోద్వేగాలను కలిగి ఉండవచ్చని గుర్తుంచుకోండి. మీ బిడ్డ కూడా మీరు అనుకున్న విధంగానే భావిస్తారని ఆశించవద్దు.
- మీ బిడ్డకు తన జీవితంపై నియంత్రణ కల్పించండి. చిన్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా వారు తమపై మరింత నియంత్రణ కలిగి ఉన్నట్లు భావిస్తారు. సంక్షోభం యొక్క అస్తవ్యస్తత తర్వాత ఇది చాలా ముఖ్యం. నిస్సహాయంగా భావించే పిల్లలు ఎక్కువ ఒత్తిడిని అనుభవించవచ్చు.
- మీ బిడ్డను అతి సంరక్షణకు గురి కాకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఏదైనా సంక్షోభం తర్వాత మీ కుటుంబాన్ని సన్నిహితంగా ఉంచుకోవాలనుకోవడం మీకు సహజం. కానీ వారి ప్రపంచం సురక్షితమైన ప్రదేశమని వారు భావించేలా చేయడం ముఖ్యం.
వ్యాకులమైన సంఘటన తర్వాత కుటుంబ దైనందిన చర్యలు
ఇది ముఖ్యం:
- వీలైనంత వరకు మీ దినచర్యను కొనసాగించండి. ఇది పిల్లలకు నమ్మకాన్నిస్తుంది.
- మీ బిడ్డ వారి సాధారణ దినచర్యను నిర్వహించలేకపోతే వారికి భరోసా ఇవ్వండి. ఇందులో పాఠశాలకు వెళ్లడం లేదా ఇంటి పనులు చేయడం వంటివి ఉండవచ్చు.
- వారి ప్రవర్తనకు కొత్త దినచర్యలు, బాధ్యతలు లేదా అంచనాలు వంటి మార్పులను ప్రవేశపెట్టకుండా ఉండండి.
- ఇంట్లో పెద్దవారిగా మీ పాత్రను కొనసాగించండి. మీరు ఇబ్బంది పడుతుంటే, సహాయం కోసం మీ బిడ్డపై ఆధారపడకపోవడం ముఖ్యం.
మీ బిడ్డ కోలుకోవడానికి ఎలా సహాయం చేయాలి:
ఇది ముఖ్యం:
- మీ బిడ్డ ఆడుకోవడానికి తగినంత సమయం ఇవ్వండి. ఇది క్రీడ కావచ్చు, వారికి ఇష్టమైన ఆటలు మరియు తెలిసిన స్నేహితులతో చేసే కార్యకలాపాలు కావచ్చు.
- సరదాగా గడపడానికి సమయం కేటాయించండి. నవ్వు, మంచి సమయాలు మరియు కలిసి గడిపే ఆనందం కుటుంబ సభ్యులందరికీ మంచి అనుభూతిని కలిగిస్తాయి.
- మీ బిడ్డ ఆకలి మారవచ్చని గుర్తుంచుకోండి. వారు భోజన సమయంలో తినడానికి ఇష్టపడకపోతే, బదులుగా రోజంతా వారికి సాధారణ ఫలహారము అందించండి.
- మీ బిడ్డకు తగినంత విశ్రాంతి మరియు నిద్ర అందేలా చూసుకోండి.
- వారికి శారీరక వ్యాయామంలో సహాయం చేయండి. ఇది మీ బిడ్డ ఒత్తిడిని తగ్గించడానికి మరియు వారి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
- చక్కెర, రంగు ఆహారాలు మరియు చాక్లెట్లను పరిమితం చేయండి.
- మీ బిడ్డ శారీరకంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేయండి. ఇది గోరువెచ్చని స్నానాలు, మర్దనలు, కథ చెప్పే సమయాలు మరియు చాలా కౌగిలింతలతో కావచ్చు.
- మీ బిడ్డను నిరాశకు గురిచేస్తే లేదా ఆందోళనకు గురిచేస్తే ప్రక్రియను మార్చండి. ఉదాహరణకు, మీ బిడ్డను ఆందోళనకు గురిచేసే లేదా భయపెట్టే టెలివిజన్ కార్యక్రమం.
మీరు ఎప్పుడైనా మీ మానసిక ఆరోగ్యం గురించి లేదా సన్నిహిత వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే, 13 11 14 నంబర్లో లైఫ్లైన్కు సంప్రదించండి.
ఎక్కడ సహాయం పొందాలి
- సాధారణ వైద్యుడు (వైద్యుడు)
- మీ ప్రసూతి మరియు శిశు ఆరోగ్య ఉపచారిక
- మీ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం
- శిశువైద్యుడు లేదా చైల్డ్ మరియు అడోలసెంట్ సైకియాట్రిస్ట్ - మీ వైద్యుడు మిమ్మల్ని సూచించగలరు
- ఫీనిక్స్ ఆస్ట్రేలియా సెంటర్ ఫర్ పోస్ట్-ట్రామాటిక్ మెంటల్ హెల్త్ టెలిఫోన్. (03) 9035 5599
- సెంటర్ ఫర్ గ్రీఫ్ అండ్ బిరీవ్ మెంట్ టెలిఫోన్.1800 642 066
మీరు వీటి నుండి కూడా సలహా పొందవచ్చు:
- లైఫ్లైన్ టెలిఫోన్. 13 11 14
- గ్రీఫ్ లైన్ టెలిఫోన్. 1300 845 745
- బియాండ్ బ్లూ టెలిఫోన్.1300 22 4636
- కిడ్స్ హెల్ప్ లైన్ టెలిఫోన్. 1800 55 1800
- నర్స్-ఆన్-కాల్టెలిఫోన్. 1300 60 60 24 - నిపుణుల ఆరోగ్య సమాచారం మరియు సలహా కోసం (24 గంటలు, 7 రోజులు)
- ఆస్ట్రేలియన్ పేరెంటింగ్ వెబ్సైటు - raisingchildren.net.au